![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -373 లో.. కృష్ణ మురారి లు ఆదర్శ్ కోసం వెతుక్కుంటూ.. జమ్మూ కాశ్మీర్ వరకు వస్తారు. దార్లో ఒక దగ్గర టీ తాగడానికి ఆగుతారు. అక్కడ ఒక్కటే కప్ ఉండడం.. నువ్వు తాగు అంటే నువ్వు తాగు అని ఇద్దరు అనుకుంటారు. ఇక తింగరి కృష్ణ తనకున్న అతి తెలివి తో ఒక కప్ లో తను తాగేసి ఆ కప్ ని రివర్స్ చేసి మురారిని తాగమని చెప్తుంది. ఇద్దరు టీ తాగడం అయ్యాక మళ్ళీ ప్రయాణం మొదలు పెడుతారు.
ఆ తర్వాత మెహత చెప్పిన విలేజ్ దగ్గరికి వచ్చి.. దార్లో వెళ్తున్నా ఒక అతనికి ఆదర్శ్ ఫోటో చూపించి తెలుసా అని అడుగుతారు. తెలుసు అటు వైపే వెళ్తున్న చూపిస్తానంటు.. అతను కృష్ణ, మురారీల కార్ లో వెళ్తాడు. కాసేపటికి ఆదర్శ్ ఉన్న దగ్గరికి వస్తారు. ఆదర్శ కొంతమంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటాడు. అప్పుడే కృష్ణ, మురారీలు దగ్గర వరకు వెళ్తారు. రూపం మారిన మురారీని ఆదర్శ్ గుర్తుపట్టడు. అలాగే కృష్ణ ఎవరో కూడా ఆదర్శ్ కి తెలియదు. ఎవరు మీరని ఆదర్శ్ అడుగుతాడు. మురారి అని కృష్ణ చెప్తుంది. ఆ తర్వాత కృష్ణ ఆదర్శ్ కి .. మురారిది ఏ పరిస్థితులో రూపం మారిందో అంత వివరిస్తుంది. అతనే మురారి అని తెలుసుకున్న ఆదర్శ్. మురారిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతాడు. అలా కాసేపటికి కృష్ణ నా భార్య అంటు మురారి పరిచయం చేస్తాడు. ఏంటి ముకుందని పెళ్లి చేసుకోలేదా అని ఆదర్శ్ తన మనసులో అనుకుంటాడు.
కాసేపటికి ఇక మనం ఇంటికి వెళదామని మురారి అనగానే..నేను రానని ఆదర్శ్ అంటాడు. ఇప్పుడు పరిస్థితులు అన్ని చక్కబడ్డాయ్. పెద్దమ్మ నీ కోసం ఎదురు చూస్తుందని మురారి అంటాడు. ముకుంద, మురారీతో ఫోన్ మాట్లాడిన విషయం గుర్తుకు చేసుకొని.. ఇప్పుడు ఇప్పుడే బాధని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నానని ఆదర్శ్ అంటాడు. అదంతా మర్చిపోయి ఇంటికి వెళదామని కృష్ణ అంటుంది. నాకు అంత తెలుసని కృష్ణ చెప్తుంది. నీ మనసు లో ముకుంద ఉంది. ఇప్పుడు తను మారిపోయిందని మురారి చెప్తాడు. అవును మీ మనసులో ముకుందపై ప్రేమ అలాగే ఉందని కృష్ణ చెప్తుంది. కృష్ణ మురారీ ఇద్దరు కలసి కన్విన్స్ చేసి ఆదర్శ్ ని ఇంటికి తీసుకొని వెళ్తారా? లేదా .. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |